కలం, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్ట్ (Singur Project) వద్ద మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్ట్‌లోని ఎడమ, కుడి ఎర్తెన్ బండ్లపై విద్యుదీకరణ (Electrification) పునరుద్ధరణ పనులను చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 80.20 లక్షల నిధులు మంజూరు చేసింది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ విద్యుదీకరణ పనులు పూర్తి అయితే, ప్రాజెక్ట్ నిర్వహణ మరింత సులభతరం కానుంది. రాత్రి సమయాల్లో భద్రత, పర్యవేక్షణ మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ విషయమై మంత్రి దామోదర్ రాజానరసింహ స్పందించారు. ‘సింగూర్ ప్రాజెక్ట్ (Singur Project) అభివృద్ధికి మరో ముందడుగు. ప్రభుత్వం మొత్తం రూ. 8.14 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ చర్యల ద్వారా ప్రాజెక్ట్ సామర్థ్యం పెరిగి, రైతులకు నీటి సరఫరా సమర్థవంతంగా అందేలా మార్గం సుగమం అవుతుంది. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం’ అని ఆయన అన్నారు.
Read Also: ‘బాబోయ్.. ఇక్కడ ఉండలేం!’.. అమెరికా వద్దంటున్న భారతీయులు
Follow Us On : WhatsApp

