తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నిధులు విడుదల

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఉద్యోగులకు (Employee Dues) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో మరో రూ.2 వేల కోట్ల బకాయి నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా నిధులు రిలీజ్ చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో లక్షలాది మంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 29న మొదటి విడతలోనూ రూ.2 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ నిధులు విడుదల చేయడం అభినందనీయమని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన బకాయిలను కూడా ఇదే తరహాలో చెల్లిస్తామని చేస్తామని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించడంతో ఉద్యోగులు సంతోషపడుతున్నారు. ఇక పెండింగ్ లో ఉన్న బకాయిలను 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు విడుదల చేస్తామని ఇటీవల రేవంత్ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>