కలం, వెబ్ డెస్క్ : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఉచిత బీమా (Free Insurance Scheme) రక్షణ కల్పించే కొత్త పథకం ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ పలు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ పథకం కింద ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం రూ. 1.20 కోట్ల వరకు ఉచిత బీమా రక్షణను కల్పించనుంది. సహజ, ప్రమాద మరణాలకు ఈ బీమా వర్తించనుంది. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంపై ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: టీమిండియాలోకి కొత్త ఆల్‌రౌండర్.. షెడ్గేకు ఛాన్స్
Follow Us On: Instagram

