Mobile Popup Ad
Mobile Popup Ad

గుడ్ న్యూస్.. రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో పండుగల కోలహలం నెలకొంది. నేడు హిందువుల పండుగ ఉగాది జరుగుతుండగా.. ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పండుగ కూడా వెంటనే రానుంది. షవ్వాల్ నెల చంద్రుడి దర్శనాన్ని అనుసరించి మార్చి 20 లేదా 21న రంజాన్ పర్వదీనాన్ని ముస్లింలు జరుపుకుంటారు. ఇదిలాఉంటే తెలంగాణలోని ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసపు ఆఖరి శుక్రవారం ‘జుమాతుల్ విదా’ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు (మార్చి 20) రాష్ట్రవ్యాప్తంగా ఐచ్ఛిక సెలవు (Optional Holiday) ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

వాస్తవానికి ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఈ సెలవును తొలుత మార్చి 13న ఇవ్వాలని భావించింది. అయితే, రంజాన్ మాసపు చంద్రదర్శనం, పండుగ కాలాన్ని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు, ఈ సెలవును మార్చి 20కి మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వక్ఫ్ బోర్డు సిఫారసును పరిశీలించిన రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ (GAD), గతంలో ఉన్న తేదీని సవరిస్తూ మార్చి 20న ఐచ్ఛిక సెలవును ఖరారు చేసింది. ఈ నిర్ణయం వల్ల రంజాన్ మాసపు చివరి శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు (నమాజ్) చేసుకునే ముస్లిం ఉద్యోగులకు ఊరట లభించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>