Mobile Popup Ad
Mobile Popup Ad

ఉగాది పురస్కారాలు అందజేసిన సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: ఏపీలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఉగాది పురస్కారాలు అందజేశారు. వివిధ రంగాల్లో విశిష్ట కృషిచేసిన కళాకారులకు ఉగాది పురస్కారాలు (Ugadi Awards) అందజేశారు. సాహిత్యం, సంగీతం, కళారంగాల్లో ఉగాది కళారత్న పురస్కారాలను కళాకారులకు సీఎం అందించారు.లబ్ద ప్రతిష్టులైన కళాకారులకు హంస జ్ఞాపికలను అందించి సీఎం అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని 38 మందికి కళారత్న, 122 మందికి ఉగాది పురస్కారాలు అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరికీ సీఎం పరాభవ నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సీఎంతో పాటు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేష్‌, కేశినేని శివనాథ్, గద్దె రామ్మోహన్, బొండా ఉమ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సిద్ధాంతి మాడుగుల నాగఫణిశర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. సిద్ధాంతి మాడుగుల నాగఫణిశర్మకు భగవంతుడు చక్కని వాక్చాతుర్యం ఇచ్చారని కొనియాడారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>