బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

కలం, వెబ్ డెస్క్: ఏడాది కాలంగా సామాన్య ప్రజలను ఉరుకులు పరుగులు పెట్టించిన బంగారం, వెండి ధరలు(Gold and silver prices) కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ప్రపంచ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలు, అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు, బిజినెస్ ఈక్వేషన్స్ మారుతుండటంతో ధరలు భారీగా తగ్గుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ప్రస్తుతం బూలియన్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,780 తగ్గి రూ.1,54,640 గా ఉంది. ఇదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.2250 తగ్గి రూ.1,41,750గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 16 డాలర్లు తగ్గింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 4,835 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై ధర ఏకంగా రూ.10వేలు తగ్గి రూ.2,65,000గా ఉంది. రెండు రోజుల్లోనే కిలో వెండిపై ధర రూ.15వేలు తగ్గటం గమనార్హం.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు వివిధ రకాలుగా ఉన్నాయి. రాజధాని నగరం ఢిల్లీలో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,790 వద్దకు చేరగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,900 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,640కు చేరగా.. 22 క్యారెట్ల బంగారం రూ. 1,41,750 ఉంది. ఇక కిలో వెండి.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ధర రూ.2,65,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,60,000 వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,65,000 ఉంది. ఏపీలోని ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,51,000 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,38,920 ఉంది. కిలో వెండి ధర రూ.2,42,000 ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>