Mobile Popup Ad
Mobile Popup Ad

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి కోటి ఆర్థిక సాయం

కలం, డెస్క్ : ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య (Excise Constable Sowmya) కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ వివరాలను మంత్రి జూపల్లి కృష్ణారావు వివరించారు. సౌమ్య మృతిచెందడం చాలా బాధాకరం అని చెప్పారు. జనవరి 23న నిజమాబాద్ లో గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకునేందుకు సౌమ్య తీవ్రంగా ప్రయత్నించింది. కానీ గంజాయి ముఠా వాహనంతో సౌమ్యను ఢీకొట్టగా.. తీవ్రగాయాలు అయ్యాయి. హైదరాబాద్ లోని నిమ్స్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ సౌమ్య శనివారం రాత్రి చనిపోయింది.

Read Also: ఇంజెక్షన్ వికటించి చిన్నారి మృతి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>