Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంజెక్షన్ వికటించి చిన్నారి మృతి

కలం, వెబ్​ డెస్క్​ : కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుక్కకాటుకు చికిత్స పొందేందుకు ఆస్పత్రికి వచ్చిన ఓ చిన్నారి, ఇంజక్షన్ వికటించి ప్రాణాలు కోల్పోయింది.

ఘటన వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని మూదం కాలనీకి చెందిన ద్వార్షిత (3) అనే చిన్నారిని కుక్క కరిచింది. దీంతో కుటుంబ సభ్యులు పాపను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చిన్నారికి యాంటీ రేబిస్ ఇంజక్షన్ ఇచ్చారు. అయితే, ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే పాప ఆరోగ్యం క్షీణించి మృతి చెందింది.

వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సరైన పరీక్షలు చేయకుండా ఇంజక్షన్ ఇవ్వడం వల్లే ఈ అనర్థం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి వద్ద నిరసన చేపట్టారు.

Read Also: బిఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ ను ఆయుధంలా వాడుకుంది : మంత్రి పొన్నం ప్రభాకర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>