ఎన్నికలే టార్గెట్.. మహిళా కాంగ్రెస్​ కు కొత్త సైన్యం

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ (Telangana Mahila Congress) కొత్త కమిటీని సోమవారం ప్రకటించారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లంబా ఆమోదంతో ఈ నియామకాలు చేపట్టినట్లు రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ప్రకటించారు. రాష్ట్ర కార్యవర్గంతో పాటు 22 జిల్లాల అధ్యక్షురాళ్ల తొలి జాబితాను విడుదల చేశారు. విస్తరించిన కొత్త కమిటీలో 11 మంది ఉపాధ్యక్షులు, 10 మంది ప్రధాన కార్యదర్శులు, ఐదుగురు కార్యదర్శులకు స్థానం కల్పించారు. రేఖ బోయలపల్లి, అల్లూరి కృష్ణవేణి రెడ్డి, బి. లక్ష్మమ్మ తదితరులు ఉపాధ్యక్షులుగా, అస్మా తబస్సుమ్, గోచికొండ శ్రీదేవి వంటివారు ప్రధాన కార్యదర్శులుగా ఎంపికయ్యారు.

నూతన నాయకత్వం మహిళా సమస్యలపై పోరాటాలను మరింత ముందుకు తీసుకుకెళ్తుందని ఎర్రబెల్లి స్వర్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మహిళా కాంగ్రెస్​ను బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి జిల్లా, మండలం, గ్రామంలో కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ మహిళల సమస్యల పరిష్కారానికి, సాధికారతకు కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, క్రమశిక్షణతో పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి నూతనంగా నియమితులైన కార్యవర్గ సభ్యులు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>