యూఎస్‌లో జాబ్‌ పోతే వెంటనే స్వదేశానికి?

క‌లం, వెబ్‌డెస్క్‌: అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ నిపుణులకు ప్రస్తుతం లభిస్తున్న కీలక వెసులుబాటును తొలగించే దిశగా డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. గరిష్టంగా 60 రోజుల గ్రేస్‌ పీరియడ్ ను తొలగించే ప్రతిపాదన పరిశీలిస్తున్నది. ఉద్యోగం పోయిన తర్వాత ఇప్పటివరకు 60 రోజుల సమయంలో కొత్త సంస్థను వెతుక్కోవచ్చు. ముఖ్యంగా హెచ్-1బీ ఉద్యోగి కొత్త సంస్థ ద్వారా ఉద్యోగ మార్పు కోసం పిటిషన్‌ దాఖలు చేయించుకోవచ్చు. అవసరమైతే మరో ఇమ్మిగ్రేషన్‌ స్టేటస్ కు మారేందుకు ప్రయత్నించవచ్చు లేదా అమెరికా నుంచి వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. అయితే ప్రతిపాదన తుది రూపం దాల్చితే.. భారతీయ నిపుణులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉద్యోగం పోయిన వెంటనే స్వదేశాలకు పంపించేలా ఈ ప్రతిపాదన రెడీ అవుతున్నది. గ్రేస్ పీరియడ్ను కుదిస్తారా? మొత్తం ఎత్తివేస్తారా అనే దానిపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

– ఉద్యోగం పోయిన తర్వాత మరో ఉద్యోగం వెతుక్కోవడానికి గ్రేస్ పీరియడ్ 60 రోజులు ఉండేది. ఈ నిబంధన 2017 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ–1, ఈ–2, ఈ–3, హెచ్‌‌–1బీ, హెచ్–1బీ1, ఎల్–1 తదితర కేటగిరీల నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులు, వారి డిపెండెంట్లకు ఈ గ్రేస్ పీరియడ్ ఉంది.
– కొత్త ప్రతిపాదన అమలులోకి వస్తే.. ఉద్యోగం ఊడిన వెంటనే విదేశీ ఉద్యోగులు, వారి డిపెండెంట్లు అమెరికాను వీడాల్సి ఉంటుంది.
– ఈ పరిణామం భారతీయ ఉద్యోగులపై తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తున్నది. అమెరికా హెచ్–1బీ వీసాల ప్రధాన లబ్ధిదారుల్లో ఇండియన్స్  ఎక్కువ. యూఎస్లో భారతీయ–అమెరికన్ జనాభా సుమారు 52 లక్షలు. అందులో తెలుగువాళ్ల వాటా అధికం. 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఎత్తివేస్తే వీరందరిపై ఎఫెక్ట్ పడుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>