కలం, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండ్ వద్ద జాతీయరహదారిపై కాళ్లపూర్ రైతులు (Parigi Farmers Protest) ఆందోళనకు దిగారు. పరిశ్రమలకు తమ పంట భూములు ఇవ్వలేమని స్పష్టం చేశారు. జాతీయ రహదారిపై రైతులు బైఠాయించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తమ పంట పొలాలను పరిశ్రమల కోసం లాక్కోవద్దంటూ ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేశారు. జాతీయరహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. తమకు స్పష్టమైన హామీ కావాలని, కలెక్టర్ వచ్చేంతవరకు కదిలేది లేదంటూ రైతన్నలు అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కొందరు రైతులను అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్కి తరలించే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలోనే మిగతా రైతులు పోలీస్ వాహనాన్ని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.
Read Also: పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు మళ్ళీ నిరాశే !!
Follow Us On : WhatsApp

