నేడు ఉద్యోగ సంఘాలతో సీఎస్ చర్చలు

కలం, వెబ్ డెస్క్: ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఎంప్లాయీస్‌ జేఏసీ నేతలు (Employees JAC) బుధవారం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నాయి. మంగళవారమే చర్చలు జరపాలని డిమాండ్ చేసినా సాద్యం కాలేదు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిర్వహించిన సమీక్ష ఆలస్యం కావడంతో  చర్చలు వాయిదా వేశారు. తమతో వెంటనే చర్చలు జరిపి తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు సాయంత్రం 6 నుంచి కొన్ని గంటలపాటు వేచి చూసినా ఫలితం దక్కలేదు.

సీఎస్ బిజీ మీటింగ్ దృష్ట్యా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు చర్చలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే జేఏసీ నేతలతో చర్చలు రెండు రోజుల్లో నాలుగుసార్లు వాయిదా పడటం గమనార్హం. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు  తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>