కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రత సంరక్షణ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలు కోసం, ‘ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్’ (EHCT Board) బోర్డు సభ్యులను నియమించింది. ఈ మేరకు EHCT బోర్డును పునర్వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీలైనంత త్వరగా సమావేశమై, EHS అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను, ఆరోగ్య కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని ప్రభుత్వం మండలిని ఆదేశించారు.
ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ బోర్డుకు (EHCT Board) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు. ఆర్థిక, వైద్యారోగ్య, విద్యా, హోం, సాధారణ పరిపాలన, పురపాలక పరిపాలన, పంచాయతీ రాజ్ తదితర 15 శాఖల అధిపతులు ఇందులో సభ్యులుగా ఉంటారు. EHS ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) సభ్య-కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వివిధ ఉద్యోగ సంఘాలు, పింఛను దారుల సంఘాలకు చెందిన సుమారు 12 మంది ప్రతినిధులు కూడా ఈ మండలిలో సభ్యులుగా ఉంటారు.
Read Also: మోదీతో భేటీ.. భారత్ కు ట్రంప్ శుభవార్త
Follow Us On: Instagram

