కలం, వెబ్ డెస్క్ : కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్నాటకలోని శివమొగ్గ (Shivamogga) లో ఘోర విషాదం చోటు చేసుకుంది. వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడి సమీపంలోని గుడిసెపై పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
భార్య, భర్తతో పాటు మూడేళ్ల కుమారుడు మట్టిదిబ్బల కింద చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు విడిచారు. ఈ క్రమంలోనే పలువురు కొండ చరియలు కింద చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read : నాలో అదే చూస్తారు.. సాయి పల్లవి ఓల్డ్ కామెంట్స్ వైరల్!
Follow Us On : WhatsApp

