వింటర్‌లోనూ సమ్మర్ హీట్.. విద్యుత్ డిమాండ్ పీక్!

కలం, తెలంగాణ బ్యూరో: ఎల్‌ నినో ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో విద్యుత్ (Telangana Electricity) వినియోగం గణనీయంగా పెరిగింది. ఇప్పటికే రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్, వినియోగం చేరుకోవడంతో రానున్న రోజుల్లో మరింత పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో పాటు ఈ సంవత్సరం చలికాలం ప్రభావం కూడా ఉండకపోవచ్చని, కరెంటు వాడకం పెరగొచ్చని అంచనా. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ మంగళవారం గరిష్టంగా 19,133 మెగావాట్లకు, మొత్తం విద్యుత్ వినియోగం 326.70 మిలియన్ యూనిట్లకు చేరింది.

20 వేల మెగావాట్లకు చాన్స్

అయినప్పటికీ ఎక్కడా లోటు లేకుండా విద్యుత్ సరఫరా చేయగలిగామని విద్యుత్ సంస్థలు పేర్కొన్నాయి. సెప్టెంబరు నెలలో ఫస్ట్ టైమ్ 9వ తేదీన 19,543 మెగావాట్ల డిమాండ్ ఉంటే ఇప్పుడు అది 19,133 మెగావాట్లకు చేరుకున్నట్లు తెలిపాయి. అంటే శీతాకాలం సమీపిస్తున్నా.. దాదాపు అదే స్థాయికి చేరుకున్నది. ఎల్‌ నినో పరిస్థితి మరింత ముదిరితే 20 వేల మెగావాట్ల డిమాండ్ ఏర్పడవచ్చని అంచనా. హైదరాబాద్ విషయానికొస్తే సమ్మర్లో 4,800 మెగావాట్ల మేర డిమాండ్ వస్తే ఇప్పుడు (మంగళవారం) అది 4,072 మెగావాట్లకు చేరుకున్నది. వాడకం రీత్యా చూస్తే దాదాపు 83 మి.యూ. దక్షిణ డిస్కం పరిధిలో అత్యధికంగా 12,044 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. సెప్టెంబర్ 11న ఏర్పడిన డిమాండ్‌ కంటే (11,828 మెగావాట్లు) ఇప్పుడు పెరిగింది. జిల్లాల్లోనూ వినియోగం పెరిగింది.

యూనిట్ ధర రూ.10

డేటా సెంటర్లు, ఐటీ పార్కులు, పారిశ్రామిక కారిడార్లు, మెట్రో రైలు విస్తరణ, వ్యవసాయ అవసరాలతో పాటు పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఆఫీసుల్లో, ఇండ్లలోనూ వినియోగం పెరుగుతున్నది. ఆ డిమాండ్కు తగినట్లుగా విద్యుత్ను సమకూర్చుకోవడం, సరఫరా చేయడం విద్యుత్ సంస్థలకు సవాలుగా మారాయి. రాష్ట్రంలో అవసరాలకు తగినంత ఉత్పత్తి లేకపోవడంతో ప్రస్తుతం పవర్ ఎక్స్ఛేంజి, ఓపెన్ మార్కెట్ నుంచి కొనాల్సి వస్తున్నది. కానీ రాష్ట్ర అవసరాల మేరకు దొరకడంలేదని, ఒక్కో యూనిట్ ధర గరిష్టంగా రూ. 10కి చేరుకున్నదని అధికారులు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రబీ సీజన్కు మోటారు పంపుసెట్ల వినియోగం పెరిగితే సర్దుబాటు చేయడం విద్యుత్ సంస్థలకు ఛాలెంజింగ్ టాస్కే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>