Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యా రంగంపై తీవ్ర నిర్లక్ష్యం.. జూన్ 5న భారీ ఆందోళన

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వలన విద్యా రంగం రోజురోజుకు నిర్లక్ష్యం, సంక్షోభంలో వెళుతోందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ జగిత్యాల (Jagtial) జిల్లా అధ్యక్షులు ఎన్నం రాంరెడ్డి విమర్శించారు. విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం విద్యా ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా జూన్ 5న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ర్యాలీ, ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు. కమిటీ జగిత్యాల జిల్లా శాఖ సమావేశం రాంరెడ్డి అధ్యక్షతన గురువారం జగిత్యాలలో జరగగా.. జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్.రాజేందర్ హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు విద్యకు 20 శాతం నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం–2020 అమలు తిరస్కరించాలన్నారు.

యంగ్ ఇండియా స్కూళ్ల స్థాపన మానుకోవాలి..

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల స్థాపనను నిలిపివేయాలని రాజేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యా కమిషన్ సూచించిన తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల స్థాపన సైతం మానుకోవాలన్నారు. వీటి స్థానంలో ప్రస్తుతమున్న పాఠశాలలనే సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చి అభివృద్ధి చేయాలన్నారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొక్కుల రాంచంద్రం, డీటీఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్ల సంతోష్, టీపీటీఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోవర్ధన్, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ సభ్యులు భోగ రమేష్, శశికుమార్, రాజేశం, రఘుపతి యాదవ్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>