కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆదివారం కాంగ్రెస్ (Congress) పార్టీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు వచ్చాయి. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ పీసీసీ జనరల్ సెక్రటరీ ఝాన్సీరెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఫిర్యాదు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారిని సస్పెండ్ చేయాలని కోరారు. ఝాన్సీరెడ్డి ఫిర్యాదుపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్చించింది. అలాగే పెండింగ్ ఫిర్యాదులపై కూడా కమిటీ చర్చించింది.

