కామారెడ్డిలో బోనాల సందడి.. అమ్మవారి సేవలో ఇందుప్రియ

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని 14వ వార్డులో నిర్వహించిన బోనాల పండుగ (Bonalu Festival) వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ (Gaddam Indu Priya) హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారిని దర్శించుకుని, ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సమృద్ధి కలగాలని ప్రార్థించారు.

అనంతరం గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందకరమని అన్నారు. ఇలాంటి పండుగలు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ రామ్ శెట్టి హర్షిత, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>