సీఎం రేవంత్‌ అమెరికా పర్యటన రద్దు!

కలం, వెబ్ డెస్క్ : కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం అమెరికా పర్యటన రద్దయింది. యూకే, అమెరికా పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాల ప్రకారం కేంద్ర అనుమతి కోరగా, మొదట యూకే పర్యటనకు మాత్రమే మంజూరు లభించింది. ప్రతినిధి బృందం లండన్ చేరుకున్న తర్వాత అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని కేంద్రం తెలియజేసింది. దీంతో సీఎం తన అమెరికా పర్యటనను రద్దు చేసుకుని, లండన్ నుంచి ఆగస్టు 23న హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు.

రాష్ట్ర ప్రగతికి, విద్యా రంగానికి ఎంతో కీలకమైన ఈ పర్యటనకు రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడం, యువతకు అంతర్జాతీయ విద్యా అవకాశాలు కల్పించడమే తమ పర్యటన ముఖ్య ఉద్దేశమని సీఎం తెలిపారు. తాను వెళ్లలేకపోయినా, అధికారిక బృందం షెడ్యూల్ ప్రకారం అమెరికాలో పర్యటిస్తుందని స్పష్టం చేశారు. హార్వర్డ్, ఎంఐటీ, నార్త్‌ఈస్టర్న్, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలని అధికారులకు సూచించారు.

యువత భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, లండన్‌లో తన పర్యటన యథావిధిగా కొనసాగుతుందని సీఎం (Revanth Reddy) తెలిపారు. అక్కడ ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్ ప్రతినిధులతో సమావేశమై కీలక భాగస్వామ్యాలపై చర్చించనున్నారు. “తెలంగాణ రైజింగ్ (Telangana Rising) ఆగదు” అని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Also Read : సీఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేల కీలక నిర్ణయం..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>