కలం, నిర్మల్: ఆదిలాబాద్ జిల్లా పోలీసుల (Adilabad Police) ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ (Police Constable), ఎస్సై (SI) ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ (Free Coaching) అందించేందుకు అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఉచిత కోచింగ్‌లో పాల్గొనదలచిన అభ్యర్థులు తప్పనిసరిగా తమ సమీప పోలీస్ స్టేషన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
అర్హత పరీక్ష ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని, అభ్యర్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ సబ్ డివిజన్‌కు చెందిన అభ్యర్థులకు నలంద కాలేజ్, శ్రీ చైతన్య పాఠశాల (మావల)లో, ఉట్నూర్ సబ్ డివిజన్ అభ్యర్థులకు చావర అకాడమీ (మావల)లో పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
అర్హత సాధించిన అభ్యర్థులకు డీటీసీ ఆదిలాబాద్‌లో నిపుణులచే ఉచిత శిక్షణ (Free Coaching) అందించనున్నట్లు తెలిపారు. పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Also Read : ఇంటర్ విద్యాశాఖలో పోస్టుల పంచాయితీ..!
Follow Us On: X(Twitter)

