కేరళలో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం: నేడు, రేపు బిజీ షెడ్యూల్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేడు, రేపు కేరళ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నేడు త్రివేండ్రం, అలప్పుజ, ఎర్నాకుళం జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేడు ఉదయం 9.30 గంటలకు త్రివేండ్రంలోని ఎస్ఎం లాక్ జంక్షన్ నుంచి ముట్టతార వరకు నిర్వహించే భారీ రోడ్ షోతో ప్రారంభం కానుంది. అనంతరం ఉదయం 11 గంటలకు భారతన్నూర్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగిస్తారు.

మధ్యాహ్నం వేళ పూవాచల్ ప్రాంతంలో కట్టక్కడ నుండి వెల్లండ్ వరకు సాగే రోడ్ షోలో రేవంత్ రెడ్డి పాల్గొని ఓటర్లను ఉత్సాహపరచనున్నారు. సాయంత్రం 4 గంటలకు అలప్పుజలో నిర్వహించే మరో కార్నర్ మీటింగ్‌కు ముఖ్యమంత్రి హాజరవుతారు. ఈ కార్యక్రమాల అనంతరం ఆయన ఎర్నాకుళం చేరుకుని, అక్కడ జరగబోయే తదుపరి ప్రచార కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>