Mobile Popup Ad
Mobile Popup Ad

ఎల్లుండి సచివాలయంలో కేబినెట్ భేటీ.. నిర్ణయాలపై ఉత్కంఠ!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశం (Telangana Cabinet Meeting) జులై 2న (గురువారం) సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు మద్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ కానున్నట్లు చీఫ్ సెక్రటరీ కే. రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్నం 1 గంట లోపు శాఖల వారీగా ఎజెండా పంపించాలని సీఎస్ అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలిచ్చారు.

మంత్రివర్గ సమావేశంలో (Telangana Cabinet) మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు సంబంధించి ఫేజ్ – 1 పనులకు ఆమోదం తెలపడంతో పాటు వీబీ-జీ రామ్-జీ చట్టంపై చర్చించే అవకాశం ఉంది. కేంద్ర నిధులతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఒక ప్రత్యేక ఉపాధి హామీ చట్టం తీసుకురావాలని యోచిస్తోంది. దీనిపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారిగా పూర్తిస్థాయి డిజిటల్ విధానంలో ’ఈ – కేబినెట్‘ నిర్వహించనున్నారు.

Read Also: కాంగ్రెస్ ‘సీక్రెట్’ సర్వే.. వారిపై స్పెషల్ ఫోకస్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>