కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రేపటి స్వాతంత్య్ర వేడుకల కోసం మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లాలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. 10.15 గంటల వరకు మంత్రి సందేశం ఇవ్వనున్నారు.
10.15 నుంచి 10.20 గంటల వరకు స్వాతంత్య్ర సమరయోధుల పరిచయం, సన్మానం, 10.20 నుంచి 10.50 గంటల వరకు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 11.20 గంటల వరకు వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల శకటాల ప్రదర్శన, అనంతరం ప్రశంసా పత్రాల పంపిణీ జరుగుతుంది. 11.50 గంటల వరకు స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం హై టీతో కార్యక్రమం ముగియనుందని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు.

