క్యాబినెట్ భేటీ.. ఆ అంశాలపైనే చర్చ

కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ (Telangana Cabinet) భేటీ ప్రారంభమైంది. పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చించేందుకు ప్రయత్నం చేసినా పెద్దగా ఫలితం దక్కలేదు. తమ డిమాండ్లు నెరవేర్చవరకు సమ్మె విరమించేది లేదని కార్మికసంఘాల నాయకులు భీష్మించుకొని కూర్చొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కూడా..

రాష్ట్రంలో త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమిటి? అన్న కోణంలోనూ క్యాబినెట్ (Telangana Cabinet)లో చర్చించినట్టు సమాచారం. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇదే ఊపులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. కాళేశ్వరం రిపేర్లపై కూడా ప్రభుత్వం చర్చించినట్టు సమాచారం.

Read Also: టీఎంసీ ఖేల్ ఖతమ్ : అమిత్ షా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>