Mobile Popup Ad
Mobile Popup Ad

హైకోర్ట్ తీర్పుపై తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram) నియమించిన పీసీ.ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కమిషన్ సిఫార్సుల ఆధారంగా కేసీఆర్, హరీశ్ రావుపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని నిన్న హైకోర్ట్ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయంలో భేటీ అయిన కేబినెట్.. కాళేశ్వరం ప్రాజెక్ట్, హైకోర్టు తీర్పుపై చర్చించాక సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

న్యాయ నిపుణులతో చర్చించాకనే..

నిన్న హైకోర్ట్ తీర్పు వెలువడిన తరువాత.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించారు. సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో భేటీ అయ్యారు. వారి సలహాలు, సూచనలపై కేబినెట్ (Telangana Cabinet) లో కూలంకషంగా చర్చించిన కేబినెట్.. హైకోర్ట్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. దీంతో, ఈ కేసులో ఏం జరగనుందనే ఉత్కంఠ మరింత పెరుగుతోంది.

Read Also: గల్ఫ్ కార్మికులపై యుద్ధం ఎఫెక్ట్.. విమాన చార్జీలకు రెక్కలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>