అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2026-27 ఆర్ధిక సంవత్సరానికి గానూ బడ్జెట్ (Telangana Budget 2026) ప్రవేశపెట్టారు. ఇప్పటికే బడ్జెట్ ను రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. అనంతరం భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ. 3లక్షల 24వేల 234కోట్ల బడ్జెట్ ను భట్టి ప్రవేశపెట్టారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక ప్రయోజనం కల్పించడమే తమ లక్ష్యమని భట్టి ప్రసంగించారు. తాము పాలకులం కాదు.. ప్రజలకు సేవలకు అంటూ ఆయన పేర్కొన్నారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేశామని భట్టి తెలిపారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక, వ్యవస్థల విధ్వంసాన్ని తాము సరిచేస్తున్నామని వెల్లడించారు.

బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు.. ప్రజల చుట్టూ తిరిగే లెక్కలు అని ఆర్థిక మంత్రి భట్టి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చడమే తమ లక్ష్యమన్నారు. గొప్పల కోసం తాము అబద్ధాలు చెప్పమని పేర్కొన్నారు. తాము ఎవరినీ మభ్యపెట్టమని.. మాయమాటలు చెప్పబోమని స్పష్టం చేశారు. ప్రశ్నించే వారిని తాము నిందించబోమని పేర్కొన్నారు. అంతకుముందు ప్రజాభవన్‌లో బడ్జెట్ ప్రతులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేశారు.

విద్య, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు దావోస్ పర్యటనకు వెళ్లి అక్కడి పెట్టుబడిదారులను ఒప్పించి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని పేర్కొన్నారు.

మొత్తం బడ్జెట్ (2026-27): 3, 24, 234 కోట్లు
మూలధన వ్యయం 47, 267 కోట్లు
రెవెన్యూ వ్యయం 2.34, 406 కోట్లు

శాఖల వారీగా కేటాయింపులు (రూ. కోట్లలో)

విద్యాశాఖ -26,674
వైద్యారోగ్య శాఖ- 13,679
వ్యవసాయ శాఖ -23,179
విద్యుత్ శాఖ – 21,285
స్త్రీ, శిశు సంక్షేమం -3,143
ఎస్సీ అభివృద్ధి- 11,784
ఎస్టీ అభివృద్ధి- 7,937
మైనారిటీ సంక్షేమం-3769
ఇరిగేషన్ – 22, 615
మున్సిపల్ శాఖ -17,907
పశుసంవర్ధక శాఖ -1,529
రాజీవ్ యువ వికాసం -6,000
గృహ నిర్మాణం -7,430
ఐటీ శాఖ -875
చేనేత, జౌళి శాఖ -258
పరిశ్రమల శాఖ -3,490
పంచాయతీ రాజ్ -33,688
ఆర్ అండ్ బీ -12,789
న్యాయ శాఖ- 2,367
టూరిజం- 1,224
గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయింపు

తెలంగాణ ప్రజలపై విశ్వాసంతో వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందని నమ్మకంతో ప్రజల పక్షాన నిలబడి వారి స్వప్నాలను సాకారం చేసి 2026-27 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ను (Telangana Budget 2026) సభ ఆమోదించింది.

Read Also: మంజీరా నదిలో వేలాది చేపల మృత్యువాత

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>