నేడు తెలంగాణ బీజేపీ ముఖ్యనేతల భేటీ

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో శనివారం మధ్యాహ్నం తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలు భేటీ (Telangana BJP) కానున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్‌రావు అధ్యక్షతన బేగంపేట టూరిజం ప్లాజాలో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ కి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌లు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ సహా కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఈటల, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి హాజరుకానున్నారు.

ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. నీట్ పై పేపర్ లీకేజిపై ఢిల్లీ ఆందోళనల ఎఫెక్ట్ రాష్ట్రంలో ఎలా ఉంది? రాష్ట్ర బీజేపీకి ఎదురవుతున్న సవాళ్లు? వాటినుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలను ఎలా తిప్పికొట్టాలి? అనే అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది. ఈ సమావేశానంతరం సాయంత్రం 5 గంటలకు బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలు, నీట్ ప్రశ్నాపత్రం లీక్‌ అంశంలో విపక్షాల నిరసనలపై చర్చ జరగనుంది. అలాగే ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>