కలం, వెబ్ డెస్క్: నేటి ఆధునిక కాలంలో యువత చర్మ సౌందర్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకోసం ఖరీదైన క్రీములు కొనడం, బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడం వంటివి చేస్తుంటారు. అయితే, ఇలాంటి రసాయన ప్రొడక్ట్స్‌తో పనిలేకుండా కేవలం ఓట్స్‌ను మన సౌందర్య పోషణలో భాగం చేసుకుంటే చర్మం సహజంగా, కాంతివంతంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్ మీల్ ఫేస్ వాష్
ముఖాన్ని కాంతివంతంగా మెరిపించడానికి ఓట్ మీల్ ఫేస్ వాష్ (Oats Face Wash) చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. దీనికోసం గోరువెచ్చటి నీటిలో కొన్ని ఓట్స్ వేసి మిశ్రమంలా చేసుకోవాలి. దీనికి ఒక టీస్పూన్ తెనే కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని తీసుకుని ముఖంపై మునివేళ్లతో గుండ్రంగా రుద్దాలి. ఇలా చేయడం ద్వారా చర్మ రంధ్రాల్లో పేరుకున్న దుమ్ము, ధూళి తొలగిపోయి ముఖం శుభ్రపడుతుందట. అలాగే తేనేలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు.
ఓట్స్ బాత్‌తో.. బాడీ స్పా ఫీలింగ్
మనం రోజూ ఎన్నో పనులతో, ఒత్తిడితో అలసిపోతుంటాం. ఇలాంటి సమయంలో గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తే మనసుకు హాయిగా ఉంటుంది. అయితే, కేవలం నీళ్లతో కాకుండా స్నానం చేసే టబ్‌లో లేదా బకెట్ గోరువెచ్చని నీటిలో ఒక కప్పు ఓట్స్ పొడి, కొన్ని చుక్కల లావెండర్ నూనె వేసి కలపాలి. ఈ ప్రత్యేక మిశ్రమంతో స్నానం చేస్తే బ్యూటీ పార్లర్‌కు వెళ్లినంత మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. చర్మ సంరక్షణకు ఓట్స్.. సువాసనకు లావెండర్.. ఈ మిశ్రమంలో ఉపయోగించిన ఓట్స్ చర్మంపై ఉన్న మురికిని లోతుగా శుభ్రం చేయడంతోపాటు, చర్మంలో సహజమైన తేమ కోల్పోకుండా నిలిచి ఉండేలా చేస్తుందట.
మనం రోజూ ఎన్నో పనులతో అలసిపోతాం. ఇలాంటి సమయంలో గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది. అయితే ఇందులో ఒక కప్పు ఓట్స్, కొన్ని చుక్కల లావెండర్ నూనె వేయాలి. ఈ మిశ్రమంతో స్నానం చేస్తే మరింత మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉపయోగించిన ఓట్స్ చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు తేమ నిలిచి ఉండేలా చేస్తుంది. అలాగే లావెండర్ చర్మాన్ని సువాసనభరితం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

