కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన (Congress 1000 Days) పూర్తి చేసుకున్న నేపథ్యంలో నగరంలోని పలుచోట్ల పోస్టర్ల కలకలం రేగింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ బీజేపీ హైదరాబాద్ (Hyderabad) వ్యాప్తంగా రాత్రికి రాత్రే భారీ ఎత్తున పోస్టర్లను ఏర్పాటు చేసింది. నగరంలోని సుమారు 500 కి పైగా ప్రధాన ప్రాంతాలలో ఈ నిరసన పోస్టర్లను అతికించారు.
టీపీసీసీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పరిసరాలు, ముఖ్యమంత్రి అధికారిక నివాసంతో పాటు రవీంద్ర భారతి, లక్డీకాపుల్ బస్ స్టాండ్ వంటి రద్దీ ప్రదేశాలలో ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో ఎన్నికల హామీలు నెరవేర్చలేదని, 1000 రోజుల పాలనను (Congress 1000 Days) ప్రజలను మోసం చేసిన కాలంగా బీజేపీ విమర్శిస్తూ ఈ ప్రచారాన్ని చేపట్టింది.
Also Read : క్లైమాక్స్‌కు కొండా సురేఖ ఎపిసోడ్?.. నేడే కీలక నిర్ణయం!
Follow Us On: X(Twitter)

