కలం, వలిగొండ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy) ఆశేష సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు బత్తిని సహదేవ్ పోలేపాక జానకి రాములు అన్నారు. బుధవారం వలిగొండ (Valigonda) మండల కేంద్రంలో వైఎస్సార్ వర్ధంతిని నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 108 అంబులెన్స్, ఫీజు రియంబర్స్మెంట్, ఇందిర ఇండ్లు, ఆరోగ్యశ్రీ వైద్య సేవలు వంటివి ఎన్నో అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

