కలం, వెబ్ డెస్క్ : శ్రీకృష్ణ జన్మాష్టమి (Janmashtami) పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) నగరంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 4న జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని పశువుల, గొర్రెల, మేకల వధశాలలతో పాటు రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను పూర్తిగా మూసివేయాలని స్పష్టం చేసింది. జన్మాష్టమి పర్వదిన విశిష్టతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 533(బి) ప్రకారం ఈ నోటీసులు జారీ అయ్యాయి. నగరవ్యాప్తంగా స్లాటర్హౌస్లు, మాంసం విక్రయ శాలల బంద్ ఆదేశాలు సమర్థవంతంగా అమలు జరిగేలా చూడాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్లను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కోరారు.

