కలం, వెబ్ డెస్క్: తన సమస్య చెప్పుకునేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను కలవాలని రైల్వే కోడూర్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) బాధితురాలు హర్ష వీణ (Harsha Veena) వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. తనకు, అరవ శ్రీధర్‌కు మధ్య జరిగిన విషయం పవన్ కల్యాణ్‌కు ఎంత మేరకు తెలుసో తనకు అవగాహన లేదన్నారు. పవన్ కల్యాణ్‌కు చాలా విషయాలు చెప్పాలని తెలిపారు.
తను కూడా పవన్ కల్యాణ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఉద్యోగి అని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కలిసి తన బాధ చెప్పుకోవాలన్నారు. ఒక వేళ జరిగిన దాంట్లో తన తప్పు ఏమైనా ఉంటే శిక్ష అనుభవించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తప్పు చేస్తే నన్ను చంపేయండి… నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నా.. కానీ, పోరాటాన్ని మాత్రం ఆపను అని ఆమె (Harsha Veena) స్పష్టం చేశారు. తన సమస్య చెప్పుకునేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.
Read Also: పగలు సాఫ్ట్‌వేర్.. రాత్రి గజదొంగ
Follow Us On: Sharechat


