epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘పోలవరం – నల్లమల సాగర్’ ఆపండి.. అసెంబ్లీ కీలక తీర్మానం

కలం, వెబ్​ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు బిల్లులతో పాటు కొన్ని తీర్మానాలకూ ఏకగ్రీవ ఆమోదం లభించింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులను ఇవ్వాలని, ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు పనులు జరగకుండా అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ప్రవేశపెట్టిన ఈ తీర్మానాలకు శాసనసభ ఆమోదం తెలిపింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్​ ప్రాజెక్టుకు వ్యయపరిమితి పెరిగిపోయిందని, ఇప్పుడు 90 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించడానికి అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అంతర్రాష్ట్ర జల వివాదాలన్నీ పరిష్కరించే వరకు ఆంధ్రప్రదేశ్​ చేపట్టబోతున్న పోలవరం బనకచర్ల లింక్​ ప్రాజెక్ట్ లేదా మరే ఏ ఇతర రూపంలో నైనా గోదావరి జలాలను తరలించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీ (Telangana Assembly) ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.

Read Also: వాళ్లను ఉరితీసినా తప్పులేదు.. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>