నిర్మల్‌లో అంగన్‌వాడీల ఆందోళన.. గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేత

కలం, నిర్మల్: ఫ్రీ ప్రైమరీ కేంద్రాల ఏర్పాటును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ అంగన్‌వాడీ యూనియన్ (Anganwadi Union) జిల్లా కార్యదర్శి శైలజ డిమాండ్ చేశారు. గురువారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఫ్రీ ప్రైమరీ, పీఎం కేంద్రాల నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసి అంగన్‌వాడీలకు అప్పగించాలని కోరారు.

అలాగే ఐసీడీఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్‌వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేతనాలు సకాలంలో అందక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు అంగన్‌వాడీ ఉద్యోగులు, వర్కర్స్ పాల్గొన్నారు.

Read Also: ఎమ్మెల్యేల ప‌నితీరుపై కాంగ్రెస్ సీక్రెట్ సర్వే..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>