కలం, వెబ్ డెస్క్ : బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya) తెలంగాణ ప్రజలను కానీ, ఇక్కడి పోరాట ఉద్యమాలను కానీ ఎక్కడా అవమానించలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)తెలిపారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. గతంలో జరిగిన చారిత్రక పరిణామాలను ప్రస్తావిస్తూ, తెలంగాణకు జరిగిన అన్యాయంపైనే ఆయన గళమెత్తారని కిషన్ రెడ్డి వివరించారు.
ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అనుసరించిన మోసపూరిత విధానాల వల్ల తెలంగాణ సమాజం ఎంతటి నష్టాన్ని చవిచూసిందో ఎంపీ ప్రశ్నించారని కిషన్ రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది అమాయకులు బలికావడానికి, ఆ తర్వాతి మలిదశ ఉద్యమంలో సుమారు 1200 మంది ఉద్యమకారులు ప్రాణత్యాగం చేయడానికి కాంగ్రెస్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన ఈ అన్యాయాలను ఎత్తిచూపడమే తేజస్వి సూర్య ఉద్దేశమని, అంతేకానీ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఆయన మాట్లాడలేదని కేంద్రమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Read Also: రేవంత్ వర్సెస్ కేసీఆర్.. ఒకే రోజు ఇద్దరి ప్రోగ్రామ్స్..
Follow Us On: WhatsApp

