కలం, వెబ్ డెస్క్: పూరి జగన్నాథ రథయాత్ర (Puri Jagannath Rath Yatra)లో జరిగిన తొక్కిసలాటలో మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. గురువారం నాడు జరిగిన రథోత్సవంలో రథాలను లాగుతున్న సమయంలో విపరీతమైన జనసందోహంతో తొక్కిసలాట జరిగింది. ఇద్దరు భక్తులు తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపోయారు. వెంటనే వారిని పూరి జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఒకరు మృతి చెందగా, చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై, మృతుల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

