కలం, వెబ్ డెస్క్: ఏపీలో పురపాలక సంస్థలు, నగర పంచాయతీలోని 16 మంది కమిషనర్లను (Municipal Commissioners) రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిలో నగరపాలక సంస్థల జోనల్ కమిషనర్లు, ద్వితీయ, తృతీయ శ్రేణి పురపాలక సంస్థల్లో కమిషనర్లు ఉన్నారు. గతంలో బదిలీ అయి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సందర్భంగా అవకాశం కల్పించారు. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం వీరిని బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కమిషనరేట్‌లో జోనల్ కమిషనర్‌గా ఉన్న రమ్య కీర్తన నరసరావుపేట మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. దర్శి మున్సిపల్ కమిషనర్‌గా అర్జునరావు, పులివెందుల మున్సిపల్ కమిషనర్‌గా మునికుమార్, ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్గా సుభాష్ చంద్రబోస్, తెనాలి మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్‌గా రామారావు, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సౌత్ జోనల్ కమిషనర్గా ప్రసాదరావు, గుంటూరు మున్సిపాలిటీ అడిషనల్ కమిషనర్‌గా మల్లయ్య నాయుడులను నియమించారు. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని సురేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Also: ‘అణచివేత నుంచి అధికారం వైపు’.. !
Follow Us On: WhatsApp

