Mobile Popup Ad
Mobile Popup Ad

హాస్పిటల్ టాయిలెట్‌లో బిడ్డకు జన్మ.. కిటికీలోంచి విసిరేసిన యువతి

కలం, వెబ్ డెస్క్ : కేరళ (Kerala) లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కడుపు నొప్పితో హాస్పటల్ కు వచ్చిన 19 ఏళ్ల యువతి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందును కిలికీలోంచి విసిరేసింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పెళ్లికాని ఓ 19 ఏళ్ల యువతి కడుపునొప్పి నివారణకు కేరళలోని హరిపద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు పరీక్షలు చేయాలని సూచించగా నిరాకరించింది.

పర్యవేక్షణలో ఉన్న సమయంలో ఆ యువతి పలుమార్లు టాయిలెట్‌కు వెళ్లడం గమనించిన వైద్యులు, కొంతసేపటికి టాయిలెట్ నుంచి శిశువు ఏడుపు గమనించి అప్రమత్తమయ్యారు. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేయగా ఆస్పత్రి బయట నవజాత శిశువు పడి ఉండడం కనిపించింది. వెంటనే శిశువుకు చికిత్స అందించడం ప్రాణాలు కాపాడగలిగారు. అనంతరం తల్లి బిడ్డలను అలప్పుజలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పసికందు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని విచారిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>