పార్పెల్లి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత.. స్పందించాలని కలెక్టర్‌కు వినతి

కలం, నిర్మల్: లక్ష్మణచందా మండలం పార్‌పెల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల (Parpally Govt School) లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగినా ఉపాధ్యాయుల సంఖ్య పెరగకపోవడంతో విద్యాబోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించామని తెలిపారు.

గత ఏడాది 38 మంది విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఆ సంఖ్య 138కి చేరిందని పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగినప్పటికీ అన్ని తరగతులకు కలిపి కేవలం ముగ్గురు ఉపాధ్యాయులే ఉండటంతో బోధన భారంగా మారిందన్నారు. ఉపాధ్యాయుల కొరతపై గతంలో జిల్లా విద్యాశాఖ అధికారికి విన్నవించినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పాఠశాలకు అదనపు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>