చైన్ స్నాచింగ్‌ను తప్పించబోయి.. గాయాలపాలైన టీచర్

కలం, మెదక్ బ్యూరో: చైన్ స్నాచర్ల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదం జరిగి ఓ ఉపాధ్యాయురాలు (Teacher Injured) తీవ్రంగా గాయపడిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నారాయణఖేడ్ మండలం నాగపూర్ తండా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు శ్రావణి ఉదయం స్కూటీపై స్కూల్‌కు వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని దుండగులు ఆమె మెడలోని గొలుసును లాగేందుకు ప్రయత్నించారు. దీంతో వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆమె స్కూటీపై నుంచి పడిపోయారు. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై నారాయణఖేడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>