కంటెంట్ నచ్చితే.. ఏ క్యారెక్టరైనా చేస్తా: రాజశేఖర్‌

కలం, సినిమా: యాంగ్రీ హీరో డా.రాజశేఖర్‌ను ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ (Film Critics Association) సత్కరించింది. డా.రాజశేఖర్‌ కమ్‌ బ్యాక్‌ మూవీ ‘బైకర్‌’ సినిమాలో ఆయన నటించిన పాత్రకు మంచి గుర్తింపు రావడంతో ఆయనకు క్రిటిక్స్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు జె.వి. బత్తుల ప్రసాద్‌రావు, సెక్రటరీ సురేష్‌కొండేటి బొకేను అందించారు. అనంతరం క్రిటిక్స్‌ ట్రెజరర్‌ భరద్వాజ సన్మాన పత్రాన్ని ఆయనకు అందించారు. ఈ సందర్భంగా సీనియర్‌ జర్నలిస్ట్‌, క్రిటిక్స్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ.. రాజశేఖర్‌ నటన గురించి మనం ప్రత్యేకించి మాట్లాడక్కర్లేదు. అంకుశం ఆగ్రహం వంటి చిత్రాల్లో ఆయనది గ్రేట్‌ పెర్ఫార్మెన్స్‌. మనతో ఆయన అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన వెంకటేశ్వరావు ఎప్పుడూ మాట్లడనివారు ఆయన కూడా మాట్లాడారు అంటేనే చెప్పవచ్చు ఆయన మీడియాతో ఎంత చక్కగా ఉంటారో. సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో ఆయన స్పిరిట్‌గాని ఆయన ఉత్సాహం మరింత రెట్టింపుగా ఉండాలి. ఫిలిం క్రిటిక్స్‌ చేస్తున్నారంటే దానికి ఒక గొప్పతనం ఏర్పడుతుంది. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకానొక సమయంలో ఫిలిం క్రిటిక్స్ చేసిన సన్మానం అనేది ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అన్నారు. రాజశేఖర్‌ సహాయ సహకారాలు ఎప్పటికీ మన అందరికీ ఉంటాయి” అని అన్నారు.

జీవితరాజశేఖర్‌ మాట్లాడుతూ.. “మనమందరం ఒక ఫ్యామిలీలాంటి వాళ్ళం. మీడియాతో మాకు ఎప్పుడూ బావుంటది. మమ్మల్ని మీరు ఎప్పుడూ కించపరచలేదు. ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా ఎక్కువయిపోయి వాటిల్లో వచ్చే కొన్ని వార్తల వల్ల అసలు మీడియా ఏంటి జర్నలిజం ఏంటి అని కొంత కన్‌ఫ్యూజన్‌కి గురయ్యాను. రాజశేఖర్‌కు ఎన్నో అవకాశాలు వచ్చినా తను ఇన్‌స్పైర్‌ అయ్యే పాత్రలు రాక చేయడం లేదు. అదే విషయాన్ని ఆయన “బైకర్‌” ప్రమోషన్స్‌ సమయంలో చెబితే దానికి.. “రాజశేఖర్‌ (Rajashekhar) క్యారెక్టర్స్‌ అడుగుతున్నారు” అన్నారు. ఆఫర్స్ అనేకం వస్తున్నాయి. నచ్చిన పాత్రలు రావడంలేదు అన్నారు. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మొత్తం ఫ్యామిలీని కలిసినట్లు అనిపించింది” అని అన్నారు.

సీనియర్‌ జర్నలిస్టులు బాలరెడ్డి, మోహన్ గోటేటి మాట్లాడుతూ.. డా.రాజశేఖర్‌ చాలా విలక్షణమైన కథానాయకుడు. ఆయన నటించిన అంకుశం, తలంబ్రాలు చాలా అద్భుతమైన సినిమాలు. ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సంచలనాలు సృష్టించాయి. క్రిటిక్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కి వచ్చిన మొట్ట మొదటి హీరో డా. రాజశేఖర్‌ అని అన్నారు.

అనంతరం సీనియర్‌ జర్నలిస్ట్‌ ట్రేడ్‌గైడ్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… రాజశేఖర్‌‌తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ రోజు పిలవగానే వచ్చి మాకు సహకరించినందుకు చాలా ఆనందంగా ఉంది” అన్నారు. క్రిటిక్స్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జనార్ధన్‌ మాట్లాడుతూ.. రాజశేఖర్‌ నటించిన అన్ని చిత్రాలు నేను కవర్‌ చేశాను” అంటూ పాత విషయాలను గుర్తు చేసుకున్నారు.

హీరో రాజశేఖర్‌ (Rajashekhar) మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 3 బైకర్‌ సినిమా రిలీజయింది. అప్పటి నుంచి నా పాత్రకు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది ఎంతో మంది ఫోన్లు చేసి మెచ్చుకున్నారు. కానీ నా మనసులో ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అంటే నాకు ప్రత్యేక గౌనవం ఉంది. వేరే అవార్డులతో పోల్చితే ఇదే నాకు చాలా పెద్ద అవార్డు. అంకుశం ముందు నాకు యాక్సిడెంట్‌ అయింది. అంకుశం పెద్ద హిట్‌ అయింది. ఆ తరువాత వచ్చిన మగాడు సినిమా కూడా పెద్ద హిట్‌ అయింది. అదేవిధంగా ఇటీవల మళ్లీ నాకు యాక్సిడెంట్‌ అయింది. బైకర్‌ మంచి హిట్‌ అయింది. ఆ తరువాత వస్తున్న సినిమా కూడా పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను. ఇప్పుడిప్పుడే కాస్త బెటర్‌గా ఫీలవుతున్నాను. బైకర్‌ హిట్‌ మాత్రం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఎందుకంటే సక్సెస్‌ చూసి చాలా రోజులు అవడంతో నాకు అలా అనిపిస్తుందేమో నాకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ నేను థియేటర్‌ నుంచి బయటకు రాగానే మీరు ఇంకా సినిమాలు చేయాలి అంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇంకా కంటిన్యూస్‌గా రావాలి. మంచి సినిమాలు చేస్తుండాలి అని ప్రేక్షకులు అంటుంటే చాలా ఆనందంగా ఉంది” అన్నారు.

క్రిటిక్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ సురేష్‌ కొండేటి మాట్లాడుతూ… ముందుగా జీవితకు చాలా థ్యాంక్స్‌. ఈ కార్యక్రమానికి ఇంత అద్భుతంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>