Mobile Popup Ad
Mobile Popup Ad

‘జాగృతి’తో కొత్తతరం రాజకీయాలు చూస్తారు : కవిత

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ సమూల అభివృద్ధే జాగృతి లక్ష్యం అని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) స్పష్టం చేశారు. కరీంనగర్ జాగృతి కేంద్ర కార్యాలయంలో అధ్యక్షురాలు కవిత సమక్షంలో పలువురు నాయకులు జాగృతిలో చేరారు. జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో మండలానికి చెందిన YSRCP మాజీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండమీద అంజయ్య, YRSCP హుజురాబాద్ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్ జంపాల రితిష్, YSRCP జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు అంబల హరీష్‌లతో పాటు గంగాధర మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా మీడియా సెల్ ఇన్‌చార్జ్ మ్యాక వినోద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాధర మోహన్, సుంకపాక రమేశ్, గంగాధర మనోజ్, సుంకపాక కిరణ్ తదితరులు కవిత నాయకత్వం పట్ల విశ్వాసంతో జాగృతిలో చేరారు. వారికి కవిత కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు.

జాగృతి జిల్లా నాయకులు MD సల్మ రూపొందించిన పార్టీ ఆవిర్భావ వాల్ పోస్టర్‌ను జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ భవిష్యత్‌ను మార్చే నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావానికి ఈనెల 25వ తేదీన మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదిక అవుతుందని కవిత అన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం జాగృతి పనిచేస్తుందని, ఇప్పటికే 50 కమిటీలు వేసి, తెలంగాణ ప్రజలు ఎదుర్కుంటున్న చాలా సమస్యలకు శాశ్వతమైన పరిష్కారానికి తెలంగాణ జాగృతి కృషి చేసిందన్నారు.

స్వతంత్రం వచ్చి మనకు ఏడు దశాబ్దాలు దాటినప్పటికి ప్రజలు ఇప్పటికీ అభివృద్ధికి దూరంగా ఎందుకు ఉన్నారో, మనల్ని ఇప్పటి వరకు పాలించిన పార్టీలు సమాధానం చెప్పాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, జిల్లా నాయకులు బుడిగె పరుశరాం గౌడ్, MD సల్మ, పొన్నం రమేశ్​, లింగారెడ్డి, తాజ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>