కలం, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ మహానాడు (Mahanadu) కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతన్న విషయం తెలిసిందే. మహానాడు తొలి రోజున పార్టీకి విరాళాలు వెల్లువెత్తాయి. విరాళాల ఇచ్చిన వారి పేర్లను పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) స్వయంగా చదివి వినిపించారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, నాయకులు భారీ మొత్తంలో ఆర్థిక సహాయం అందించారు. మొత్తంగా తొలి రోజే టీడీపీకి రూ.11 కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కలిసి రూ.5 కోట్ల విరాళాన్ని అందించారు. అలాగే మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రూ.1.50 కోట్ల విరాళం ప్రకటించారు. ఎంపీ సానా సతీష్ కూడా రూ.1.50 కోట్లను పార్టీకి అందజేశారు. ప్రముఖ విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ రూ.1 కోటి విరాళం ఇచ్చారు. మరోనేత పట్టాభిరామ్ (పట్టాభి) రూ.2 లక్షలు అందజేశారు.
మహానాడు (Mahanadu) వేదికపై విరాళాలు ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రాబోయే రాజకీయ కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి ఈ నిధులు ఉపయోగపడతాయని నాయకత్వం పేర్కొంది. భారీగా వచ్చిన విరాళాలు టీడీపీకి ఉన్న మద్దతును ప్రతిబింబిస్తున్నాయని నేతలు అభిప్రాయపడ్డారు.
Read Also: ‘మావిగన్’ మాట వింటే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుంది: జగన్
Read Also: డిజిటల్ విప్లవం

