Mobile Popup Ad
Mobile Popup Ad

ఆందోళన చెందవద్దు.. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం: కలెక్టర్

కలం, మెదక్ బ్యూరో: అకాల వర్షాలతో తడిసిన వరిధాన్యం కొనుగోలు చేస్తామని సిద్ధిపేట కలెక్టర్ హైమావతి (Siddipet Collector Hymavathi) స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ క‌మిటీ గోదాంను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు.

జిల్లా వ్యాప్తంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని కలెక్టర్ హైమావతి భరోసా ఇచ్చారు. వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం వివరాలను సేకరించి, ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.

Read Also: ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ రెయిడ్స్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>