Mobile Popup Ad
Mobile Popup Ad

‘మావిగన్’ మాట వింటే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుంది: జగన్

కలం, వెబ్ డెస్క్ : వైసీపీ కీలక నేతలతో బుధవారం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబుకు ‘మావిగన్’ మాట వింటే బీపీ పెరిగిపోతుందని.. ఆ మాట అంటే అక్కడే పడిపోయేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు లక్షల కోట్లు వృథా చేస్తున్నారని, అమరావతిలో మౌలిక వసతుల కోసమే రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు రెండేళ్ల పాలన ఎలా ఉందో అందరికీ తెలిసిందని.. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేది రుజువైందని పేర్కొన్నారు.

కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైందని.. అయిన కూడా ఆడబిడ్డ నిధికి నిధుల్లేవని, 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలకు ఏడాదికి రూ.18 వేలు లేవని వెల్లడించారు. 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ ఇవ్వలేదని ఆరోంచారు. నిరుద్యోగ భృతిలోనూ మోసం చేశారని మండిపడ్డారు. ఇక పెట్రోల్ , డీజిల్ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే తగ్గించకపోగా.. బాదుడు మొదలుపెట్టారని ఫైర్ అయ్యారు. హామీలను అమలు చేయలేని కూటమి ప్రభుత్వం.. గొ.డ్డళ్లు, కత్తులు, కటార్లంటూ కొత్త డైవర్షన్ ను తీసుకొచ్చారని మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>