Mobile Popup Ad
Mobile Popup Ad

నేటి నుంచి టీడీపీ మహానాడు : కీలక తీర్మానాలు!

కలం, వెబ్‌ డెస్క్ : తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు (TDP Mahanadu) నేటి నుంచి రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఈ ఏడాది మహానాడును సరికొత్త సాంకేతికతతో హైబ్రీడ్‌ మోడ్‌లో నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులను ఒకేతాటిపైకి తెచ్చేందుకు వీలుగా 1,848 క్లస్టర్లలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కార్యకర్తలు, నేతలు తమ తమ క్లస్టర్ల వారీగానే ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకోనున్నారు.

ఈ సారి మహానాడులో స్త్రీ శక్తిని చాటిచెప్పేలా ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. రాబోయే 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఒక పక్కా రోడ్‌ మ్యాప్‌ను ఈ వేడుకల్లో ఖరారు చేయనున్నారు. పార్టీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ రెండు రోజుల వేడుకల్లో మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 10, తెలంగాణ నుంచి 4, అండమాన్‌ నుంచి ఒక తీర్మానం ఉండనున్నాయి. వీటితో పాటు నాలుగు ఉమ్మడి తీర్మానాలు, ఒక కీలక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>