Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. రద్దీ దృష్ట్యా శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 6 గంటలు సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 89,403 భక్తులు దర్శించుకోగా.. 44,234 భక్తులు తలనీలాలు సమర్పించారు. మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అలాగే 2.55 లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్లు పేర్కొంది. 4.14 లక్షల లడ్డులు విక్రయించిట్లు వెల్లడించింది.

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల(Tirumala)లో టీటీడీ మరో సేవను ప్రారంభించింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ ‘రీ-ఎంట్రీ’ సదుపాయాన్ని కల్పించింది. సర్వదర్శనం టికెట్ కలిగిన భక్తులు వైకుంఠం-2లో ఆధార్ నంబర్ ఆధారంగా ప్రత్యేక టోకెన్ పొందవచ్చు. అనంతరం 17వ కంపార్ట్ మెంట్ వద్ద రీ-ఎంట్రీ పాస్ తీసుకుని క్యూలైన్ నుంచి బయటకు వచ్చి విశ్రాంతి తీసుకునే అవకాశాన్ని కల్పించింది. కేటాయించిన సమయానికి 20 నిమిషాల ముందు రీ-ఎంట్రీ గేట్ వద్దకు చేరుకుంటే మళ్లీ దర్శనానికి అనుమతి లభిస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>