Mobile Popup Ad
Mobile Popup Ad

నకిలీ ఎలక్ట్రికల్ వైర్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal) నగరంలో నకిలీ ఎలక్ట్రికల్ వైర్లు విక్రయిస్తున్న కేటుగాడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 3 లక్షల 59 వేల విలువ గల నకిలీ ఎలక్ట్రికల్ వైర్లు సీజ్ చేశారు. హనుమకొండ పెగడపల్లి డబ్బాల సమీపంలో కాంతిలాల్ అనే వ్యక్తి అర్బుధ ఎలక్ట్రికల్స్ సానిటరీ షాప్ నిర్వహిస్తున్నాడు. గోల్డ్ మెడల్ కంపెనీకు చెందిన ఎలక్ట్రికల్ వైర్స్ స్థానంలో నకిలీ వైర్లు విక్రయిస్తూ కస్టమర్ల ను మోసం చేస్తున్నాడు. పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా షాప్ పై దాడి చేసి రూ. 3 లక్షల 59 వేల విలువ గల వైర్స్ గుర్తించి సీజ్‌ చేశారు. స్వాధీన పరుచుకున్న సామగ్రితో పాటు నిందితుడిని హనుమకొండ పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు.

Read Also: సంచలనంగా మారిన 42 రూల్స్.. బన్నీ టీమ్ రెస్పాండ్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>