మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు షాక్.. పల్స్‌టుడే సర్వే

కలం, డెస్క్ : తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ పూర్తయింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ (Exit Poll) బయటకు వస్తున్నాయి. పల్స్‌టుడే తాజాగా తన సర్వే ఫలితాలను ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతోందని తెలిపింది. బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగలబోతోందని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. బీజేపీ అనూహ్యంగా రెండు కార్పొరేషన్లను ఖాతాలో వేసుకుంటోందని చెప్పింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరంగా ఒకసారి చూద్దాం.

మున్సిపాలిటీ పరంగా..

116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 84-85, బీఆర్ ఎస్ 23-27, బీజేపీ 4-5, ఎంఐఎం 1 గెలుచుకుంటాయని అంచనా వేసింది పల్స్ టుడే. మిగతా సర్వేలతో పోలిస్తే.. బీఆర్ ఎస్ తక్కువ సీట్లు గెలుస్తుందని పల్స్ టుడే సర్వేలో ఉంది.

కార్పొరేషన్ల పరంగా..

కార్పొరేషన్లలో కాంగ్రెస్ కు ఐదు, బీజేపీకి రెండు దక్కుతాయని పల్స్ టుడే అంచనా వేసింది. నిజమాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లను బీజేపీ గెలుస్తుందని.. మహబూబ్ నగర్, రామగుండం, నల్గొండ, కొత్తగూడెం, మంచిర్యాల కార్పొరేషన్లలో కాంగ్రెస్ గెలుస్తుందని పల్స్ టుడే తెలిపింది. బీఆర్ ఎస్ కు ఒక్క కార్పొరేషన్ కూడా దక్కదని అంచనా వేసింది.

మున్సిపాలిటీల పరంగా చూసినప్పుడు బీజేపీ కంటే బీఆర్ ఎస్ ఎక్కువ గెలుస్తుందని చెప్పిన పల్స్ టుడే.. కార్పొరేషన్ల విషయానికి వచ్చేసరికి.. బీఆర్ ఎస్ కు ఒక్కటి కూడా దక్కదని తెలిపింది. ఇతర ఎగ్జిట్ పోల్స్ (Exit Poll) లోనూ బీఆర్ ఎస్ కు ఒక్క కార్పొరేషన్ దక్కదని వస్తోంది. మరి ఫలితాలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయా లేదా అనేది చూడాలి.

Read Also: ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.. నాడు హెగ్డే.. నేడు కేసీఆర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>