నేడు బెంగాల్ సీఎంగా ‘సువేందు’ ప్రమాణ స్వీకారం

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించడంతో నేడు కాషాయ పార్టీ కొలువుదీరనుంది. సీఎం అభ్యర్థి ఎంపికపై నెలకున్న ఉత్కంఠకు అమిత్ షా తెర వేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ శాసన సభాపక్ష నేతగా సువేందు అధికారి (Suvendu Adhikari) ని ఎన్నుకున్నారు.

దీంతో శనివారం ఉదయం 11 గంటలకు బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రిగా సువేందు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కలకత్తాలోని బ్రిగేడ్ పరేడ్ జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రముఖులు హాజరుకానున్నారు.

మరోవైపు ఈ నెల 12వ తేదీన అస్సాంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆ రాష్ట్ర సీఎంగా హిమంత బిశ్వశర్మ వరుసగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే, తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>